ప్రియాంక కేసులో ఐదో నిందితుడు..! పోలీసుల వివరణ ఇది - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక కేసులో ఐదో నిందితుడు..! పోలీసుల వివరణ ఇది

November 30, 2019

పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి  కేసులో మరో ప్రచారం కలకలం రేపుతోంది.  ఆమెపై జరిగిన దారుణంలో ఐదో నిందితుడు కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి  గాలిస్తున్నట్టుగా ఉదయం నుంచి కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఉన్నట్టుగా ప్రచారం జరగడంతో దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అవన్ని గాలివార్తలేనని కొట్టిపడేశారు. 

Priyanka Reddy Case.

ఈ ఉదంతంలో నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. మరో నిందితుడు ఉన్నాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నలుగురికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించామని చెప్పారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఈ కేసులో పూర్తి వివరాలతో చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.ఇప్పటికే నలుగురికి వైద్యపరీక్షలు పూర్తి చేశారు. కాగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌ ప్రియాంక కుటుంబ సభ్యులను కలిశారు. పూర్తి వివరాలు నమోదు చేసుకొని వారిని ఓదార్చారు. నలుగురుకి శిక్ష పడేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.