Another achievement of Indian Railye..3.5 km train..Here is the video
mictv telugu

ఇండియన్ రైల్యే మరో ఘనత..వీడియో ఇదిగో

August 16, 2022

Another achievement of Indian Railye..3.5 km train..Here is the video

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రయాణికులను, వారి గమ్యస్థానాలకు చేరవేయడం కోసం భారతీయ రైల్యే ఎప్పటికప్పుడు పలు కొత్త రైళ్లను అమల్లోకి తీసుకొస్తుంది. అంతేకాకుండా పరీక్షలు, పండగల సమయాల్లో పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రయాణికులను, విద్యార్థులను సురక్షితంగా వారు చేరుకోవాల్సిన ప్రాంతాలకు తరలిస్తుంది. ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీలతో తయారు చేసిన ‘సూపర్ వాసుకి’ అనే కొత్త రైలును అమల్లోకి తీసుకొచ్చి, భారతీయ రైల్యే మరో ఘనత సాధించింది.

ఈ ‘సూపర్ వాసుకి’ రైలు విషయాకొస్తే..”ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 3.5 కి.మీల పొడవైన గూడ్స్ రైలు ఇది. ఈ రైలు ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలోని.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి కోర్బా వరకు సరకును మోసుకెళ్తోంది. ఈ రైలుకు ఐదు ఇంజిన్లు ఉన్నాయి. 295 లోడెడ్ వ్యాగన్లతో మొత్తం 27 వేల టన్నుల బొగ్గును ఒకేసారి తరలించగలదు. ఒకే రైలులో ఇంత మొత్తంలో బొగ్గు రవాణా చేయటం..భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఒక ట్రిలో 3000 టన్నుల బొగ్గును మోసుకెళ్లే రైల్వే రేక్ (ఒక్కొక్కటి 100 టన్నులతో 90 వ్యాగన్లు)ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ‘సూపర్ వాసుకి తరలించే బొగ్గుతో.. 3000 మెగావాట్ల పవర్ ప్లాంటు ఒక రోజు పూర్తిగా నడపొచ్చు” అని అధికారులు వివరాలను వెల్లడించారు.

తాజాగా ఈ రైలును అధికారులు పట్టాలపై నడించారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతేడాది వాసుకి, త్రిశూల్ పేర్లతో రైల్వేశాఖ పొడవైన సరకు రవాణా రైళ్లను నడిపింది. అయితే, ఆ ఏర్పాట్లు సూపర్ వాసుకి 3.5 కి.మీ)తో పోల్చితే చిన్నవే (2.8 కి.మీ). ఇదిలా ఉండగా.. రైల్వేశాఖ ఈ పొడవైన సరకు రవాణా రైళ్లను తరచుగా ఉపయోగించాలని యోచిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరతను నివారించేందుకు, డిమాండ్ సీజన్‌లో వీలైనంత ఎక్కవ బొగ్గు రవాణా చేసేందుకు వినియోగించాలని భావిస్తోంది.