భారతీయ రైల్వేశాఖ మరో ప్రకటన.. ఏకంగా 968 - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ రైల్వేశాఖ మరో ప్రకటన.. ఏకంగా 968

April 28, 2022

భారతీయ రైల్వేశాఖ ప్రయాణికుల విషయంలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మరో ప్రకటన చేసింది. ఈ రైళ్లు ఏప్రిల్‌ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని తెలిపింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడించారు. అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌, మన్మాడ్ మధ్య 126 రైళ్లు ఉన్నాయి. మాల్దా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు స్పెషల్ రైళ్లు ప్రయాణించనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి. ఇక, తిరుపతి-హైదరాబాద్‌, తిరుపతి-ఔరంగాబాద్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది.

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్‌ 30, మే 7,14,21,28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మళ్లీ తిరుపతి నుంచి హైదరాబాద్‌ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌ చేరకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.

మరోపక్క తిరుపతి-ఔరంగాబాద్‌ (07511) స్పెషల్‌ ట్రెయిన్‌ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్‌ చేరుకుంటుందని, ఈ రైలు మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని వెల్లడించారు.