నిజాంపేటలో మరో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

నిజాంపేటలో మరో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం

November 30, 2019

హైదరాబాద్‌లో ఏ దుర్ఘటన జరుగుతుందో అని నగరవాసులు క్షణక్షణం ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అభద్రతాభావానికి లోను అవుతున్నారు. శంషాబాద్‌లో ప్రియాంక రెడ్డి, ఓ గుర్తు తెలియని మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు. వరంగల్‌లో ఇంటర్ విద్యార్థిని మానసను ఆమె పుట్టినరోజునాడే ఓ కామాంధుడు కాటికి పంపాడు. ఈ ఘటనల గురించి రెండు రాష్ట్రాల్లోనూ కలకలం రేగింది. వాటి గురించి ఆలోచిస్తూ జనాలు బిక్కుబిక్కుమంటుంటే.. నగరంలోని నిజాంపేటలో మరో దారుణం వెలుగుచూసింది. 

Nizampet.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అపార్ట్‌మెంట్‌లోని ఇరుగుపొరుగువారు రావడంతో నిందితుడు పారిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికుల సహాయంతో హుటాహుటిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మేము లేకుంటే ఇవాళ ఆమెను కూడా ఓ మృగాడు కాటికి పంపేవాడు అని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.