Another audio in the name of Avanti Srinivas
mictv telugu

అవంతి శ్రీనివాస్ పేరిట మరో రాసలీల ఆడియో..

November 13, 2022

 

ఏపీలో వైసీపీ నేతల పేరిట వస్తున్న రాసలీల ఆడియోలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో మరో ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతున్నట్లుగా బయటకొచ్చిన ఈ కాల్ రికార్డ్ సంచలనం సృష్టిస్తోంది. ‘లవ్ యూ బంగారం ఎప్పుడూ నిద్రేనా..ఒక ఫోటో పెట్టు బంగారం‘ అంటూ ఆడియోలు ఉంది. మొత్తం రెండు నిమిషాల పాటు ఉన్న ఆడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా అవంతి పేరుతో ఓ ఆడియో బయటకు వచ్చింది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ ఆడియోను అవంతి శ్రీనివాస్ ఖండించారు.అది తన వాయిస్ కాదని స్పష్టం చేసారు.దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఇప్పుడు మరో ఆడియో విడుదల కావడం కలకలం రేపింది.