తెలంగాణలో బీజెపీ నాయకత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది. నిన్న ధర్మపురి అరవింద్ బండి సంజయ్ నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరో బీజెపీ లీడర్ పేర్ల శేఖర్ కూడా సంజయ్ నాయకత్వం మీద మండిపడుతున్నారు. కేంద్ర నుంచి మద్దతు ఉన్నా తెలంగాణలో బీజెపీని నిలబెట్టుకోవడం కష్టం అయిపోతోందని శేఖర్ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బండి సంజయ్ పేలవమైన నాయకత్వం కాణంగానే జరుగుతోందని ఆరోపించారు.
ధర్మపురి అరవింద్ మాట్లాడింది వందశాతం నిజమన్నారు మరో బీజెపీ నాయకుడు పేర్ల శేఖర్. బండి సంజయ్ నాయకత్వం చాలా చెత్తగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ విషయం కిషన్ రెడ్డి, లక్షణ్ లాంటి చెప్పాలని ఆయన అన్నారు. బండి సంజయ్ చేసే పనులు ఏ ఒక్కటీ బాగోలేవని ఆయన మండిపడ్డారు. అసందర్భపు మాటలు, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టల వలన బీజెపీ దిగజారిపోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మసీదుల తవ్వకాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్మెయిల్, అంతర్గత సెటిల్ మెంట్లు, పాత కార్యకర్తలను అవమానించడం, సమన్వయ లోపం, ఒంటెద్దు పోకడలు, వ్యక్తిగత స్వార్ధం, యూస్ అండ్ త్రోలు పార్టీ సంస్కృతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ల శేఖర్. అయినా అవన్నీ యదేచ్ఛగా నడుస్తున్నాయని వాటిని ఉదాహరణలతో సహా తాను నిరూపించడానిక సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయం అయి, సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ 3 అడుగులు ముందుకు వెళితే 6 అడుగులు వెనక్కి నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శేఖర్.
కేసీఆర్, టీఆర్ఎస్ పతనం అవుతున్న సమయంలో పార్టీని బలోపేతం చేయవలసింది పోయి మరింత దిగజారుస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నా ఉపయోగించుకోలేకోపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.