హైదరాబాద్‌లో మరో పేలుడు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో మరో పేలుడు

October 25, 2020

festival

వరుస బాంబు పేలుళ్లు హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. శనివారం జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లూస్ టీం, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

ఈ సంఘటనను మరువకముందే ఈరోజు నగరంలో మరో పేలుడు సంభవించింది. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద డస్ట్‌బిన్‌లో పేలుడు జరిగింది. డస్ట్‌బిన్‌లో ఉన్న ఓ టిన్నర్ డబ్బా వలన ఈ పేలుడు జరిగిందని తెలుస్తోంది. చెత్తను వేరుకునే ఓ వ్యక్తి డబ్బాను ఓపెన్ చేస్తుండగా ఆ డబ్బా పేలిందని స్థానికులు తెలిపారు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రి తరలి చికిత్స అందిస్తున్నారు. క్లూస్ టీం, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.