బిగ్ బాస్-4లోకి మరో కమెడియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ! - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్-4లోకి మరో కమెడియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

September 17, 2020

nhvghn

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఆటలు, పాటలు డాన్సులతో అదరగొడుతున్నారు. ఉన్న కంటెస్టెంట్లు చాలరు అన్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొంత మందిని హౌస్ లోకి పంపిస్తున్నారు. గత వారం ‘ఈరోజుల్లో’ సినిమాలోని కమెడియన్ సాయిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. 

తాజాగా బుధవారం విడుదలైన ప్రోమోలో మరో కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. జోకర్ వెనక జీవితం అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా వస్తోంది. ఈరోజు ఎంట్రీ ఇవ్వబోయేది కచ్చితంగా ముక్కు అవినాష్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో దీనిపై స్పష్టత రానుంది.