కెనడాలో హిందూ దేవాలయంపై దాడి..రామమందిరం ధ్వంసం.!! - Telugu News - Mic tv
mictv telugu

కెనడాలో హిందూ దేవాలయంపై దాడి..రామమందిరం ధ్వంసం.!!

February 15, 2023

 

hindu temple

కెనడాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. తాజాగా మరోసారి హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. మిస్సిసాగాలోని రామమందిరంపై విద్వేష దాడి జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఈ దారుణ ఘటనను టొరంటోని ఇండియన్ కాన్సలేట్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని భారతీయుల మనోభావాలను ఈ సంఘటన తీవ్రంగా గాయపరించిందని..ఈ దేవాలయం భారత వారసత్వ ఔన్నత్యానికి ప్రతీక అని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం కెనడా అధికారులను అభ్యర్థించింది.

హిందూ దేవాలయాలపై దాడి ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా కెనడాలోని బ్రాంప్టన్ లోని ఓ దేవాలయంపై దాడులు జరిగాయి. ఈ దేవాలయంలో హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు. దీంతో భారతీయులు ఆగ్రహానికి గురయ్యారు. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ గౌరీ శంకర్ ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని ఖండించారు. ఈ చర్య కెనడాలోని భారతీయులు మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంది.