హిజాబ్ వివాదం పూర్తిగా సమసిపోకముందే కర్ణాటకలో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. అదికూడా హిజాబ్ వివాదం ప్రారంభమైన ప్రాంతం నుంచే కావడం గమనార్హం. ఉడిపి జిల్లాలోని మారి జాతర, శివమొగ్గలోని ఓ దేవాలయం వద్ద నిర్వహించిన వేలం పాటలో ముస్లింలు పాల్గొనడాన్ని భజరంగ్ దళ్ అడ్డుకుంది. ఆయా దేవాలయాల్లో చివరి రోజు కోళ్లను బలివ్వడం సాంప్రదాయం. ఆ సమయంలో కోళ్ల దుకాణాలను ఒక వర్గం వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. కానీ, వేలం పాటలో వారు ఒక్కరు కూడా కనిపించలేదు. భజరంగ్ దళ్ డిమాండ్ మేరకు వేలం పాటలో ఆలయ కమిటీ కూడా వారిని దూరంగా ఉంచింది. దీంతో తమ ఉపాధి పోయిందని, జాతర కోసం చాలా పెట్టుబడి పెట్టామని ఆ వర్గం వ్యాపారులు వాపోతున్నారు.