మరో వివాదంలో ‘కరాకరె’.. హైకోర్టులో మరో పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో వివాదంలో ‘కరాకరె’.. హైకోర్టులో మరో పిటిషన్

November 26, 2019

Another controversy is the Kamma Rajyam Lo Kadapa Redlu Movie. ..Another petition in the High Court

నిత్య వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న మరో వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తనను కించపరిచేలా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్ ఉందని, ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఈ చిత్రానికి మరో సెగ తగిలింది.

కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఈ సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ఇంద్రసేనా చౌదరి అనే వ్యక్తి ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా విడుదల అయితే కమ్మ, రెడ్డి కులస్థుల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది. కావున వెంటనే విచారణ జరపాలి’ అని పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వదేరా కోర్టుకు విన్నవించారు. పిటిషన్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.