డీఎస్పీ ఇంట్లో మరో కరోనా కేసు.. వంటమనిషికి వైరస్ - MicTv.in - Telugu News
mictv telugu

డీఎస్పీ ఇంట్లో మరో కరోనా కేసు.. వంటమనిషికి వైరస్

March 25, 2020

DSP

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకిన ఈ వైరస్ తాజాగా ఇక్కడ ఉంటున్నవారికి సోకుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లా డీఎస్సీ కుమారుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో, ఆ వైరస్ ఆ ఇంటి వంట మనిషికి (33)కు కూడా అంటుకుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఐసోలేషన్ వార్డుకు తరలించారు. డీఎస్సీ భార్యతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. 

ఇటీవలే డీస్పీ కుమారుడు లండన్ నుంచి వచ్చాడు. అతడు వచ్చిన తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్‌లోకి వెళ్లకుండా ఫంక్షన్లు, బంధువు ఇళ్లకు తిరిగాడు. ఈ క్రమంలో అతనికి కరోనా పాజిటివ్ రావడంతో డీఎస్పీపై వేటు పడింది. విషయాన్ని దాచి బాధ్యతా రహిత్యంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో అదే ఇంట్లో పని చేసే వంట మనిషికి కూడా వ్యాధి సోకడం కలవరం సృష్టించింది. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. మంగళవారం ఒక్క రోజే ఆరుగురికి ఈ వ్యాధి బయటపడింది.  కరోనా వైరస్ రెండో దశకు చేరుకోవడంతో.. తీవ్రత ఇలాగే ఉంటే మూడో దశకు చేరుకోవడం పెద్ద కష్టం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.