గాంధీ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మరో కరోనా మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మరో కరోనా మహిళ

May 28, 2020

l,k

గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన తల్లులకు, వైద్యులు విజయవంతంగా పురుడు పోస్తున్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన తల్లికి, గాంధీ గైనిక్ బృందం డెలివరీ చేసింది. సదరు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే వాళ్లు కోలుకునే వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 

అయితే మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఈ మాయదారి వైరస్ బారిన పడ్డారంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అదే, ఓ గర్బిణీకి కరోనా పాజిటివ్ వస్తే.. ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడితే.. ఎంతో కేర్ తీసుకోవాలి. మొత్తానికి ఈ కేసును సవాల్‌గా తీసుకున్న గాంధీ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా డెలివరీ చేశారు. కాగా, మొన్న మేడ్చల్‌కు చెందిన కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణీకి, వైద్యులు శస్త్రచికిత్స చేశారు. సదరు మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది.