తెలంగాణ రాజధాని హైద్రాబాద్‌కు మరో భారీ పెట్టుబడి రానుంది. ముంబయికి చెందిన వెబ్‌వెర్క్స్ అనే సంస్థ రూ. 500 కోట్లతో భారీ డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది. 2022 డిసెంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తి కానున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 2026 కల్లా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. వెబ్‌వెర్క్స్ సంస్థకి ఇప్పటికే ముంబై, ఢిల్లీ, పూనేలలో డేటా సెంటర్లు ఉండగా, నూతనంగా బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్‌లలో ఏర్పాటు చేస్తోంది. అయితే హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసేదే పెద్దది కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా డిజిటలైజేషన్ వేగవంతంగా జరుగుతుండడంతో డేటా సెంటర్లకి చాలా డిమాండ్ ఏర్పడింది. ముంబై, చెన్నై లాంటి మహానగరాల్లో కొన్ని కారణాల వల్ల పెద్ద డేటా సెంటర్లను నెలకొల్పడం
కొంచెం రిస్క్‌గా భావిస్తారు. భాగ్యనగరమైతే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద కంపెనీలన్నీ ఇక్కడే డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి. ఇటీవలే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ హైద్రాబాద్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే.