Another decision of AP Sarkar..to implement 'Citizen App'
mictv telugu

ఏపీ సర్కార్ మరో నిర్ణయం..అమల్లోకి ‘సిటిజన్‌ యాప్‌’

September 3, 2022

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యాశాఖ శాఖకు సంబంధించి ఫోన్ యాప్, షీ టీమ్స్ సంబంధించి దిశ యాప్, ఆస్పత్రులకు సంబంధించి ‘ఆస్పత్రుల పర్యవేక్షణ యాప్‌’ అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా మరో యాప్‌ను అమల్లోకి తీసుకొస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో ‘క్లాప్‌’మిత్రలు రోజూ చెత్తను సేకరిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పంచాయతీరాజ్‌ శాఖ..‘సిటిజన్‌ యాప్‌’ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా..‘ఈ రోజు మీ ఇంటి నుంచి చెత్తను సేకరించారా’ అని ప్రశ్నిస్తూ ‘ఎస్‌’ లేదా ‘నో ’ చెప్పాలని పంచాయతీరాజ్‌ శాఖ మెసేజ్‌ పంపుతోంది. ఎవరైనా ‘నో’ అని బదులిస్తే, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, క్లాప్‌మిత్ర నుంచి వివరణ కోరతారు. అదే రోజు లేదా మర్నాడు ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేలా మండల, జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడతారు” అని అధికారులు తెలియజేశారు.

ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో 99,84,421 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 67,08,960 మంది తమ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు అని వివరాలను వెల్లడించారు.