రైల్యేశాఖ మరో నిర్ణయం.. పోటీ పరీక్షల కోసం - MicTv.in - Telugu News
mictv telugu

రైల్యేశాఖ మరో నిర్ణయం.. పోటీ పరీక్షల కోసం

May 6, 2022

భారత రైల్యేశాఖ మరో నిర్ణయం తీసుకుంది. మే 9,10వ తేదీల్లో దేశవ్యాప్తంగా జరగనున్న ఆర్ఆర్‌బీ (సాంకేతికేతర విభాగాల్లోని పోస్టుల) పోటీ పరీక్షల నిమిత్తం అభ్యర్థుల సౌలభ్యం కోసం, పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి విద్యార్థులు చేరుకునేలా, 65 ప్రత్యేక రైళ్లను నడపనుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీ, తెలంగాణలో కూడా నడిస్తాయని ఆ రైళ్ల వివరాలను వెల్లడించారు.

”ఎక్కువ రైళ్లు మే 8న ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల రుసుమును విద్యార్ధులు చెల్లించాలి. కానీ, రాయితీలు ఉండవు. విద్యార్ధులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాకినాడ-కర్నూలు, కడప-రాజమహేంద్రవరం, కాకినాడ-మైసూరు, కర్నూలు-మైసూరు, నర్సాపురం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఎర్నాకుళం, విజయవాడ నాగర్‌సోల్, షాలీమార్-విజయవాడ, హటియా-విజయవాడ, నర్సాపురం-త్రివేండ్రం” వంటి ప్రత్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.