Another decision of TS RTC.. Special buses will start..
mictv telugu

టీఎస్ ఆర్టీసీ మరో నిర్ణయం..ప్రత్యేక బస్సులు షురూ..

September 3, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీస్తుకొస్తుంది. ఈ క్రమంలో గతరాత్రి హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు వెళ్లే గరుడ ప్లస్‌ బస్సు సర్వీసుల్లో టికెట్‌ చార్జీలను 10 శాతం తగ్గిస్తూ, నిర్ణయం తీసుకుంది. తాజాగా మారో నిర్ణయంతో ప్రయాణికుల ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.

ఇందులో భాగంగా పోచంపాడు, పొచ్చెర, కుంతాల జలపాతాలకు ప్రత్యేక సర్వీసులను ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బస్సులను ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ నుంచి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. విహార యాత్రలు చేసేవారు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బస్సులు బయలుదేరే సమయం ఇదే..

”పోచంపాడు, పొచ్చెర, కుంతాల జలపాతాలకు ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్‌ నుంచి ఉదయం 5 గంటలకు, జేబీఎస్‌ నుంచి ఉద యం 5.30 గంటలకు బయలుదేరుతాయి. పెద్దలకు రూ.1,099, పిల్లలకు రూ.599 టికెట్‌ ధర నిర్ణయించారు. నిజామాబాద్‌ నుంచి కుంతాల జలపాతానికి ప్రత్యేక బస్సులు ప్రతి ఆదివారం ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతాయి. సాయంత్రం 5:00 గంటలకు ఈ బస్సు తిరిగి నిజామాబాద్‌ చేరుకుంటుంది. పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.200 టికెట్‌ ధరలు నిర్ణయించారు. నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి కుంతాల జలపాతం వరకు నిత్యం బస్సులు నడుస్తాయి. పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 టికెట్‌ ధర నిర్ణయించారు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ www.tsrtconline.in లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు” అధికారులు తెలియజేశారు.