దిశపై విషప్రచారం.. మరో  కుక్క అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

దిశపై విషప్రచారం.. మరో  కుక్క అరెస్ట్

December 4, 2019

ఓ ఆడపిల్లకు తీరని అన్యాయం జరిగింది. కామాంధులు రాక్షస క్రీడలో ‘దిశ’ అన్యాయంగా చనిపోయింది. ఎంత ఘోరం.. ఎంత దారుణం.. దేశమంతా ముక్తకంఠంతో ఆ నలుగురు దోషులను ఉరి తీయాలని కోరుతున్నారు. దిశ మరణంపై ఆడామగా తేడాలేకుండా ప్రతీ ఒక్కరు కన్నీరు కారుస్తున్నారు. ఆమె తల్లిదండ్రులకు సానుభూతి తెలుపుతున్నారు. అయ్యోపాపం అంటున్నారు. నిందితుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  ఉచ్చనీచాలు మరిచిన పశు స్వభావం గల కొందరు యువకులు మరీ దారణంగా సోషల్ మీడియాలో విషం కక్కుతున్నారు. ‘బాగా జరిగింది.. రాత్రుళ్లు బరితెగించి తిరిగింది కాబట్టి మంచి శాస్తి జరిగింది’ అని ఒకడు.. ‘ఈ ఘటనతోనైనా ఆడవాళ్లు బయట తిరగాలంటే ఉచ్చ పడాలని’ ఇంకొక కుక్క మొరిగాడు.

‘వాళ్లు నలుగురు చేసింది చాలా మంచి పని’ అని రేపిస్టులను ఓ పందిగాడు సమర్థించాడు. ఎంత రాక్షసత్వం? వీళ్లు మనుషులేనా? వాళ్లను జంతువులతో పోల్చినా మనదే తప్పు అవుతుంది. పాపం దిశ పశువుల వైద్యురాలు అయి, మనుషుల మృగ స్వభావాన్ని అర్ధం చేసుకోకుండా బలైంది. ఈ దారుణం మీద ఏం స్పందించకపోయినా పర్వాలేదు గానీ, సోషల్ మీడియాలో ఇంత నీచంగా పోస్టులు పెడతారా? వాళ్ల అమ్మలకు, అక్కా చెళ్లెల్లకు ఇలా జరిగితే వాళ్లు ఇలాగే విషం చిమ్ముతారా? చాలామంది నెటిజన్లు ఇదే ప్రశ్న వాళ్లని అడిగారు. అందుకు వాళ్లు ఏమాత్రం జంకులేకుండా సమాధానాలు ఇస్తున్నారు. ఆ వెధవలను కన్నది ఓ అమ్మే అన్న విషయం మర్చిపోయి.. ఆడజాతి అంటే మండిపోతున్నట్టు ఇంకా ఇంకా పోస్టులు పెడుతున్నారు. హింస కరెక్ట్ అని చెబుతున్నారు.

disha

వీరి పోస్టులపై కొందరు సహనం కోల్పోయారు. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా పోలీసులు వారి టైం లైన్‌లోకి వెళ్లి ఆ పోస్టులను డిలీట్ చేయాలని కోరారు. రాక్షస మనస్థత్వం కదా ఎందుకు వింటారు? పోలీసులు అంటే వాళ్లకు భయమా పాడా? వీరంతా ఫేస్‌బుక్‌లో గ్రూపుగా ఏర్పడి విచ్చలవిడి పోస్టులు పెట్టడం మాత్రం ఆపడంలేదు. దీంతో పోలీసులు ఇక రంగంలోకి దిగారు. నిన్న నిజామాబాద్‌లో స్టాలిన్ శ్రీరాం అనే వెధవను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మరో గజ్జికుక్క స్మైలీనానీని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి పేరుతో గుంటూరుకు చెందిన స్మైలీనాని అసభ్యకర ప్రచారం చేస్తున్నాడు. అతనికి సపోర్టుగా అమర్ నాథ్ అనే మరో వ్యక్తి కూడా విష ప్రచారానికి తెరలేపాడు. అయితే ఈరోజు గుంటూరులో అరెస్ట్ చేసిన నానీని హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని సోషల్ మీడియాలో చాలామంది కోరుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారిని కూడా పట్టుకుంటామనిఅంటున్నారు.