'ఆర్ఆర్ఆర్‌' నుంచి మరో పూర్తి పాట విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్‌’ నుంచి మరో పూర్తి పాట విడుదల

April 16, 2022

 

vuyyala

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు తమ నటనలతో ప్రేక్షకుల మతి పోగొట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నాటు నాటు అనే ఒరిజినల్ పాటను చిత్రబృందం విడుదల చేయడంతో ఎంత వైరల్ అయిందో తెలిసిందే.

ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా నుంచి ‘కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల’ అనే పూర్తి ఒరిజినల్ పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పాటలో విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మెలోడీ ట్యూన్‌కి అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ పాటను ప్రకృతి అనే చిన్నారి పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు.