Another good news for the devotees of Venkanna Swamy..
mictv telugu

వెంకన్న స్వామి భక్తులకు మరో గుడ్‌న్యూస్..

July 14, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమలలో యూపీఐ(Unified Payments Interface)విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులకు పైలట్‌ ప్రాజెక్టు కింద గదుల కేటాయింపులో ఈ యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. ఇక, త్వరలోనే తిరుమలలో అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే జరుగుతాయని, అందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.