Home > Featured > న్యూయార్క్‌లో మెరిసిన కాళేశ్వరం 

న్యూయార్క్‌లో మెరిసిన కాళేశ్వరం 

ప్రపంచంలోనే భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుగాంచింది. తెలంగాణలోని 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. కేసీఆర్ ప్రభుత్వం రూ.80,499 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణ నీటి అవసరాలను తీర్చేందుకు 150 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోయవచ్చు. అయితే ఈ ప్రాజెక్టుకు మరో గౌరవం, గుర్తింపు లభించింది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోను టీఆర్ఎస్ పార్టీ ట్విటర్‌లో పంచుకుంది.

2016లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా, మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు ఇప్పటికే పూర్తవగా, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు గానూ 8 మోటార్లు సిద్ధమయ్యాయి. మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు.

Updated : 17 Aug 2019 5:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top