హార్వే తుపాను అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తోంది. తుపాను బీభత్సంలో తీవ్రంగా గాయపడిన భారతీయ విద్యార్థిని షాలిని సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్నఆమెను, మరికొంతమంది భారతీయులను శనివారం ఆస్పత్రికి తరలించాడు. షాలిని ఆదివారం రాత్రి చనిపొయింది. శాలినితోపాటు నీటిలో కొట్టుకుపోతున్న నిఖిల్ భాటియా చనిపోవడం తెలిసిందే. ఢిల్లీకి చెందిన షాలిని సింగ్ గత నెలలో అమెరికాకు వెళ్లింది. డెంటల్ సర్జరీ లో డిగ్రీ చేసిన షాలిని ఎఏం యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ లో మాస్టర్ డీగ్రీ చేస్తున్నారు. భాటియాతో కలసి బ్రేయాన్ లేక్ లో స్వీమ్మింగ్ చేస్తూ లేక్ లో వరదలు భారీగా రావడంత ప్రమాదంలో చిక్కుకున్నారు. 200 మందిభారతీయులు ఈ వరదల్లో చిక్కుకున్నారు.