తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్ధిని మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్ధిని మృతి

December 22, 2021

08

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా బుధవారం హైద్రాబాద్‌ గాంధీ ఆసుప్రతిలో మరో విద్యార్ధిని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతి చెందిన విద్యార్ధిని పేరు నందిని అని, ఆమె స్వస్థలం ఆదిలాబాద్ జిల్లాగా తెలిపారు. ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాలలో తాను రెండు సబెక్టుల్లో తప్పడంతో మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న హెయిర్ కలర్ షాంపు త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో గమనించిన తల్లిదండ్రులు ఆసుప్రతికి తరలించగా, అక్కడి డాక్టర్లు పరిస్ధితి విషమించడంతో హైద్రాబాద్‌కు తీసుకెళ్లామని సూచించారు. దీంతో గాంధీలో ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా ఐసీయులో డాక్టర్లు చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందిని తండ్రి మాట్లాడుతూ.. నా బిడ్డ మృతికి ఇంటర్ ఫలితాలే కారణమని, తమ కూతురులాగా ఏ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డవద్దని వేడుకున్నారు. ఇకనైనా ఇంటర్ బోర్డు బుద్ది తెచ్చుకొని, ఇంటర్ విద్యార్ధులకు న్యాయం చేయాలని వేడుకున్నారు.