Another international cricket stadium in Hyderabad
mictv telugu

హైదరాబాదులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

November 5, 2022

క్రికెట్ అభిమానులకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుడ్ న్యూస్ చెప్పారు. నగరంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఆధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉప్పల‌్‌లో అంతర్జాతయ స్టేడియం ఉన్న విషయం తెలిసిందే. తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను బలోపేతం చేయాలని, విస్తరణకు తగిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేసి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అటు జీహెచ్‌ఎంసీతో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రికెట్ క్లబ్బులను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని అన్ని క్రికెట్ క్లబ్బులను హెచ్‌సీఏకి అనుసంధానం చేయాలని చెప్పారు.