ప్రస్తుతం ఐటీ రంగం దూసుకుపోతుంది. కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగాలు కూడా అదే సంఖ్యలో పెరగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఐటీ ఉద్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఐటీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. హైదరాబాద్‌లో పలు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తూ..కొత్త కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఐకే ప్రాంతానికి ఐటీ రంగం పరిమితం కాకుండా ఉండేందు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలో మరో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మలక్‌పేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించింది. 10.35 ఎకరాల స్థలంలో రూ.1,032 కోట్లతో ఐటీ టవర్‌ను నెలకొల్పనున్నారు. మొత్తం 16 అంతస్తులతో ఐటీ టవర్‌ను నిర్మించనున్నారు. దీని వల్ల పాతబస్తీ ఏరియాకు కూడా ఐటీ సర్వీసులు విస్తరిస్తాయని, యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి
గత ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కండ్లకోయలో గేట్ వ్ ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 8.5 ఎకరాల్లో 14 అంతస్తులతో నిర్మించారు. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో ఈ ఐటీ పార్క్ ఏర్పాటు అయింది. దీని ద్వారా 50 వేల మందికిపై ఉపాధి లభించనుంది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా టైర్ 1, టైర్ 2 పట్టణాలు, నగరాల్లో కూడా ఐటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని పలు నగరాల్లో కూడా ఐటీ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. సిద్దిపేట,నల్గగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్లలో కూడా ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.