ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

September 28, 2020

Another MLA tests positive in AP

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో రోజురోజుకు నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. సత్యవేడు అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్‌‌గా నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 

పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసినవారు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇదివరకే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మరోవైపు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ కూడా కరోనా బారిన పడ్డారు.