ఏపీలో మరో నంది విగ్రహం ధ్వంసం..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మరో నంది విగ్రహం ధ్వంసం.. 

September 27, 2020

Another Nandi idol destroyed in AP ...

ఏపీలో అంతుచిక్కని విధంగా హిందూ ఆలయాల్లోని విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక్షవర్గంలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆగరమంగళంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని వివిధ భాగాలుగా పగలగొట్టారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. క్లూస్ టీమ్స్, పోలీసు డాగ్స్‌ను రప్పించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి చెప్పారు.

ముందు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నంది విగ్రహం పురాతనమైనది కావడంతో దాని కింద ముత్యాలు, వజ్రాలు, పంచలోహాలు లభించవచ్చనే ఆలోచనతో దాన్ని తొలగించి ఉండొచ్చు. ఆ విగ్రహం లోపల విలువైన వజ్రాలు, పంచ లోహాలు, బంగారం వంటివి ఉండడం వల్లే నంది విగ్రహం పగుళ్లు ఇచ్చిందంటూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అత్యాశకు పోయిన దుండగులు విగ్రహాన్ని ప్రతిష్టించిన స్థానం నుంచి పెకిలించారు. అనంతరం దాన్ని పగలగొట్టారు. ఇటీవల నంది విగ్రహం కొంచెం పగుళ్లు రావడంతో ఆలయ ట్రస్టు సభ్యులు మళ్లీ సీసంతో దానిని అతికించారు’ అని తెలిపారు.