ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా! ఎక్కడంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా! ఎక్కడంటే

April 5, 2022

nbgb

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా రూపాంతరం చెందాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి కొన్ని అభ్యంతరాలు, వినతులు వచ్చాయి. అయితే ప్రభుత్వం వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. అయితే, ప్రభుత్వమే ఓ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంత్రి పేర్ని నాని కొన్ని సంకేతాలిచ్చారు. రంపచోడవరం, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను కలిపి గిరిజనుల కోసం కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. గిరిజనుల కోరిక మేరకు ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి.