మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. ధర ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?

April 22, 2022

16

మొబైల్ ప్రియులకు రియల్ మీ శుభవార్త చెప్పింది. తమ కంపెనీ నుంచి ప్రీమియం ఫోన్ జీటీ 2 భారత మార్కెట్లోకి విడుదల చేశామని పేర్కొంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ”జీటీ 2 ప్రో కంటే స్పెసిఫికేషన్లు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇది రెండు రకాలుగా విడుదలైంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 34,999. 12 జీబీ, 256 జీబీ స్టోరేజీ రకం ధర రూ. 38,999. ఈనెల 28 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి” అని రియల్ మీ తెలిపింది.

అంతేకాకుండా, ఈ ఫోన్ పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుందని, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై కొంటే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. దీంతో ఆరంభ వేరియంట్ ధర తగ్గింపు అనంతరం రూ.29,999కే లభించనుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంటుంది. 6.62 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఉంటుంది.

ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, వైడ్ యాంగిల్, మైక్రోలెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సార్ ను కంపెనీ ఏర్పాటు చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ చార్జర్‌తో వస్తుంది కంపెనీ తెలిపింది.