చైనా దేశంలో మరో కొత్త వైరస్ కలకలం రేపింది. ”ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో నమోదైంది. ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న చైనా దేశ ప్రజలు.. ఈ కొత్త వైరస్‌తో భయాందోళనకు గురౌతున్నారు.
చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేశాం. అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయి. వాటి వల్లే H3N8 వేరియంట్ అతనికి సోకింది.
అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్ సోకలేదు. దీంతో, చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలి. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలి” అని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది.