‘మరో నిర్భయ’ కేసులో మోహన్‌కు మరణశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

‘మరో నిర్భయ’ కేసులో మోహన్‌కు మరణశిక్ష

June 3, 2022

‘మరో నిర్భయ’ పేరొందిన హత్యాచారం కేసులో దోషి పాపం పడింది. దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి చంపేసిన మోహన్ కథ్వారు చౌహాన్(45)కు మహారాష్ట్రలోని దిన్ దోసి కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. అత్యంత హేయమైన నేరానికి పాల్పడినందుకు ఈ శిక్షే సరైందంటూ 32 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ‘ఇతనిపై జాలి చూపక్కర్లేదు. కన్నతండ్రే ఇతణ్ని ఛీకొట్టి, ఉరి తీయాలన్నాడు. బాబాయి కూతుర్ని రేప్ చేస్తానన్న మోహన్ మాటలు అతని స్వభావానికి అద్దం పడుతున్నాయి. ఇతడు చేసింది ఘోరం. వీడు మనిషి కాదు.’ అని జడ్జి గర్హించారు.

యూపీకి చెందిన మోహన్ ముంబై కూలినాలి చేసుకుంటూ 2021 సెప్టెంబర్‌ 10న సాకినక ప్రాంతంలో ఘోరానికి తెగబడ్డాడు ఓ టెంపోలో 34 ఏళ్ల మహిళను రేప్ చేశాడు. తర్వాత పదునైన ఆయుధాలతో జననాంగాలపై గాయాలు చేశాడు. బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోయింది. ఘోరం తర్వాత నాలుగు రోజులకే పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. మోహన్ తరఫున వాదించడానికి ఏ న్యాయవాదీ ముందకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవాదిని నియమించింది. తాగిన మత్తులో ఏదో చేశానని మోహన్ వాదించాడు. తాను పేదవాణ్నని, భార్యా పిల్లలు ఉన్నారని అన్నాడు. అయినా జడ్జి కనికరించలేదు. సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో మరణశిక్ష విధించారు.