Another notification release from UPSC jobs with degree qualification..!!
mictv telugu

UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్…డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..!!

February 22, 2023

Another notification release from UPSC jobs with degree qualification..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కేంద్ర విభాగాల్లో ఉన్న పలు పోస్టులకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లో మొత్తం 73ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం.

ఖాళీలు, అర్హతలు:
-నోటిఫికేషన్‎లో మొత్తం 73ఖాళీలను భర్తీ చేయనున్నారు.
-వీటిలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, లేబర్ ఆఫీసర్, ఫోర్ మాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ తోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేయాలి. దీంతోపాటుగా సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

-అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35ఏళ్లు ఉండాలి. లేబర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 33ఏళ్లు నిండి ఉండాలి. ఫోర్ మాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు ఉండాలి. డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు 40ఏళ్లు మించి ఉండకూడదు.

-ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తార. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 02-23-2023గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.