మళ్లీ వస్తున్న డ్రైవర్‌ రాముడు - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ వస్తున్న డ్రైవర్‌ రాముడు

October 26, 2017

అలనాటి  నటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘డ్రైవర్‌ రాముడు’ చిత్రం అప్పట్లో ఎంతటి భారీ విజయం అందుకుందో తెలిసిందే.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మరో ‘డ్రైవర్‌ రాముడు’ రాబోతున్నాడు. ప్రముఖ హాస్యనటుడు షకలక శంకర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నాడు ఇందులో. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అప్పటి చిత్రంలో ఎన్టీఆర్‌ లారీపై కాలు పెట్టి స్టైల్‌గా పోజిచ్చినట్లే శంకర్‌ కూడా పోజివ్వడం ఫన్నీగా ఉంది. సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది.