Another pandemic like Corona is coming: Bharat Biotech Chairman
mictv telugu

బీ అలర్ట్.. మరో మహమ్మారి రాబోతుంది : భారత్ బయోటెక్ చైర్మెన్

November 17, 2022

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతం కాకముందే మరోముప్పు వస్తోందంటూ భారత్ బయోటెక్ చైర్మెన్ డాక్టర్ కష్ణ ఎల్ల వెల్లడించారు. ఈ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ని తయారు చేసి కరోనా నివారణలో కీలకపాత్ర వహించింది. ఇంటర్నేషనల్ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ – 2022 సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు.

ఈ సారి ముప్పు జంతుజాలం నుంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మహమ్మారులు, విపత్తు ప్రమాదాల గురించి ప్రకృతి మనల్ని అప్రమత్తం చేస్తూనే ఉందని కానీ మనమే వాటిని పట్టించుకోవట్లేదన్నారు. అర్ధం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో స్వైన్ ఫీవర్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు వచ్చాయని, తర్వాత సార్స్ కోవ్, ఎబోలాలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బెంగళూరులో తాను చేసిన ప్రసంగాన్ని ఉదహరించారు. అనంతరం ఊహించినట్టే కరోనా వచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా ప్రకృతి మనకు సంకేతాలు పంపుతోందని, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, లంపీ స్కిన్ వంటివి వస్తున్నాయని తెలిపారు. ఈ సారి వచ్చే ముప్పు మనుషులకే కాక మొత్తం జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపబోతుందని విశ్లేషించారు.