టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్‌ను పొందారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమెకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ”ఓ గొప్ప కార్యక్రమంలో నన్ను భాగం చేసిన తాతయ్యకు, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డికి ఈ అవార్డ్ ఘనత దక్కుతుంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యం. నాకు స్ఫూర్తినిచ్చింది” అని ఆమె అన్నారు.
మరోపక్క రాంచరణ్ తాజాగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీతారామరాజు పాత్రతో దేశ వ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఆయన సతీమణి ఉపాసన తన కెరీర్లో భాగంగా భర్త గర్వించే పురస్కారాలను అందుకుంటుంది. అంతేకాకుండా అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అపోలో లైఫ్‌కి వైస్ చైర్ పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా విధులు నిర్వరిస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన చేస్తున్న పనులను గుర్తిస్తూ పలు సంస్థలు అవార్డులను ఇస్తున్నాయి.