షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం భాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలై పది రోజులు దాటినా పఠాన్ హవా తగ్గడం లేదు. భారీగా వసూళ్లను రాబడుతోంది. బాద్ షా దెబ్బకు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. తాజాగా మరో రికార్డ్‌ను అందుకుంది. రూ. 729 కోట్లతో వరల్డ్ వైడ్ భారీ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా పఠాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో దంగల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. దంగల్ ప్రపంచ వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ వచ్చినా.. చైనాలో సాధించిందే ఎక్కువ. అక్కడ హిందీలో కాకుండా మాండరిన్ భాషలో రిలీజ్ చేయగా రూ.1200 కోట్లను రాబట్టింది.
పాక్‌లోను షారుఖ్ హవా కొనసాగుతుంది. అక్కడ అధికారికంగా భారత్ సినిమాలపై నిషేధమున్నా..అనధికారికంగా పఠాన్ షోలను వేస్తున్నారు. టికెట్ రేటును పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.900గా నిర్ణయించినప్పటికీ భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారని సమాచారం. పఠాన్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండడం పాక్ లోనూ షారుఖ్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. విమర్శలు, వివాదాలు మధ్య విడుదైలన పఠాన్ చిత్రం ఘన విజయాన్ని అందుకొని రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్లడం విశేషం. ఇక మరికొద్ది రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి పఠాన్ చిత్రం చేరే అవకాశం ఉంది.