నందమూరి నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆయనను రక్షించేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రోజురోజుకి తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగవుతున్నా.. పరిస్థితి మాత్రం ఇంగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సోమవారం విడుదల చేసిన విడుదుల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు టెస్ట్‌లను చేసి దానిప్రకారం మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. నేడు మరోసారి ఆసుపత్రి వర్గాలుహెల్త్ బులెటిన్‌ను విడుదల చేయనున్నాయి. ఈ నివేదికలో ఏం చెబుతారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనుల చేస్తున్నారు.
తారకరత్నను చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులుతో పాటు టీడీపీ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అతడి ఆరోగ్యపరిస్థితిని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. తాజాగా తారకరత్న ఐసీయూలో ఉన్నప్పటికీ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
జనవరి 27న లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు కుప్పం ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.