రవిప్రకాశ్‌కు మరో షాక్.. కార్లు స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

రవిప్రకాశ్‌కు మరో షాక్.. కార్లు స్వాధీనం

June 14, 2019

 

Another shock for Raviprakash Alanda Media which was seize by cars..

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రవిప్రకాశ్ కార్లను అలంద మీడియా స్వాధీనం చేసుకుంది. ఎంతో ఖరీదైన ఆ కార్లను గతంలో టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్‌కు కేటాయించింది. అయితే, ఉద్యోగం నుంచి తొలగించినా రవిప్రకాశ్ ఆ కార్లను ఉపయోగిస్తున్నాడంటూ టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలంద మీడియా కోర్టును ఆశ్రయించింది.

దీంతో, ఆ వాహనాలు అలంద మీడియాకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో, పోలీసులు రవిప్రకాశ్ నివాసానికి వెళ్లి కార్లను సీజ్ చేశారు. డ్రైవర్ల ఫోన్లను కూడా తీసేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటికి వచ్చి కార్లను ఎలా సీజ్ చేస్తారంటూ రవిప్రకాశ్ భార్య పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.