Another Shock To AP BJP chief Somuveerraju
mictv telugu

పాపం సోమువీర్రాజు

November 22, 2022


ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుకు షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఝలక్ నుంచి తేరుకునేలోపే మరో చేదు అనుభవం ఎదురైంది.మీరెవరో మాకు తెలియదంటూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది గేట్ దగ్గరే ఆపేశారు.

విశాఖలో ఝలక్

సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. రాష్ట్ర సర్కార్ పై ఒంటికాలుపై లేచేవారు. ఎప్పుడూ జనం మధ్య ఉండేవారు.ఆందోళనలతో ఏపీని అట్టుడికించేవారు. అంతర్వేది బంగారు రథం నుంచి రామతీర్థం దాకా షేక్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు. అప్పట్లో ఉన్న ఫైర్ లేదు. సైలెంట్ అయ్యారు. ఇదే రివర్స్ కొడుతుందేమో..మొన్న విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ అడిగిన ప్రశ్నతో అవాక్కయ్యారు. మీరు ఎవరు..మీ గురించి పరిచయం చేసుకోండి అని సోమువీర్రాజును చూస్తూ మోదీ అన్నారు. దీనికి ఆయన షాక్ అయ్యారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీలో ఇది జరిగింది.

సీఐఎస్ఎఫ్ షాక్

ఇప్పుడు అదే విశాఖలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఝలక్ ఇచ్చారు. విశాఖలో కర్మయోగి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా వెళ్లారు. ఆయన్ను లోపలకు రాకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైనా తననే లోపలకు పంపించరా అంటూ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ఇది చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లోపలకు అనుమతించాలని చెప్పారు. ఆవేశంలో ఉన్న సోమువీర్రాజును శాంతింపజేసేందుకు అధికారులు ప్రయత్నించారు. గేట్ దగ్గర సిబ్బందికి మీ గురించి తెలియదని సర్దిచెప్పారు.

వరుస షాక్‌లు

ఏపీ బీజేపీలో యాక్టివ్‌గా పనిచేసే నేతల్లో సోమువీర్రాజు ఒకరు. ఫైర్ బ్రాండ్ లీడర్.ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పోరాటాలు చేస్తారు. కానీ ఈ మధ్య ఆయన సైలెంట్ కావడంపై కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా మారారని చర్చించుకుంటున్నారు. మళ్లీ పాత సోమువీర్రాజుని ఎప్పుడు చూస్తామోనని అనుకుంటున్నారు.