వర్మ ‘అ.రా.క.బి’కి సెన్సార్ కష్టం.. - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ ‘అ.రా.క.బి’కి సెన్సార్ కష్టం..

November 30, 2019

నిన్న విడుదల అవాల్సిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా షాక్ ఇచ్చింది. కులాలు, వివాదాస్పద రాజకీయాలతో తయారైన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ‘ఈ రోజు ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు రివైజింగ్ కమిటీకి వెళ్లాలని సలహా ఇచ్చారు..’ అని  రాంగోపాల్ వర్మ వెల్లడించారు.

సినిమా విడుదల ఆగిపోవడంపై వర్మ నిన్న ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ‘ఈ సినిమా ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమాలో ఏ కులాన్ని కానీ, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. నేను ఎవరినీ టార్గెట్‌ చేసి చేసిన సినిమా కాదు. సెన్సార్ నిబంధనలను పాటిస్తే.. ఏ సినిమా విడుదల కాదు. కానీ, అన్నీ రూల్స్‌ను ఈ సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నా’ అని తెలిపాడు వర్మ.