అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి . ఫిలడెల్ఫియాలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వీటిలో 2 ఏళ్ల బాలిక కూడా ఉంది. కాల్పుల్లో గాయపడిన రెండేళ్ల బాలికను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. బాలిక తొడ భాగంలో గాయమైంది. ఈ కాల్పుల్లో ఐదుగురు యువకులు కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
UPDATE: A 2-year-old girl, her mother, and 5 teenagers are all in stable condition following a shooting near a Philadelphia school: https://t.co/9nZF72KVEr https://t.co/hxvBhNHKlH
— NBC10 Philadelphia (@NBCPhiladelphia) February 24, 2023
వారం రోజుల క్రితం అమెరికాలోని మిసిసిపీలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలోని అర్కబుట్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు మరణించారు. హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. టేట్ కౌంటీలోని అర్కబుట్లలో జరిగిన హత్యలను మిస్సిస్సిప్పి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రతినిధి బెయిలీ మార్టిన్ ధృవీకరించారు.
అంతకుముందు టెక్సాస్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. టెక్సాస్‌లోని ఎల్ పాసోలోని షాపింగ్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బుల్లెట్లు పేలడంతో మాల్‌లో భయాందోళనలు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి రాబర్ట్ గోమెజ్ తెలిపారు.