Home > Featured > తిరుప్పూరులోనూ వింత సౌండ్…జనాలు పరుగుపరుగో!

తిరుప్పూరులోనూ వింత సౌండ్…జనాలు పరుగుపరుగో!

vbhnbhn

ఇటీవల బెంగళూరు నగరంలోని సర్జాపూర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్, హెచ్ఎస్ఆర్ తదితర ప్రాంతాల్లో వింత శబ్దాలు వినిపించిన సంగతి తెల్సిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఆ శబ్దాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది. ఆ శబ్దం సూపర్ సానిక్ విమానం నుంచి వచ్చిందని తెలిపింది.

తాజాగా అలాంటి శబ్దాలు తమిళనాడులోని తిరుప్పూరు ప్రజలను కూడా భయపెట్టాయి. తిరుప్పూరు, అవినాశిపాళయం, కంగేయం, పల్లాదం, అరుళ్ పురం, పొంగలూరు, కోండువై, అనుప్పరపాళయం ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ధ్వనులు వినిపించాయి. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులుపెట్టారు. దీనిపై అధికారులు స్పందించారు. తేజస్ విమానాన్ని సూలూర్ ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుంచి ప్రయోగాత్మకంగా నడిపి చూశారని, ఆ యుద్ధ విమానం సృష్టించిన ధ్వనులే ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయని అధికారులు తెలిపారు. తేజస్ యుద్ధ విమానాన్ని భారత్ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఈ విమానం సూపర్ సోనిక్ వేగాన్ని అందుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపిస్తాయి. దీన్నే 'సోనిక్ బూమ్' అంటారని అధికారులు తెలిపారు.

Updated : 28 May 2020 8:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top