మరో శ్రీలంకలా నేపాల్..ఖాట్మండ్‌లో ఘర్షణలు, కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

మరో శ్రీలంకలా నేపాల్..ఖాట్మండ్‌లో ఘర్షణలు, కాల్పులు

June 21, 2022

నేపాల్ దేశం మరో శ్రీలంకలా మారింది. నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో తాజాగా పెరిగిన ఇంధన ధరలపై చేపట్టిన నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. విద్యార్థులకు, పోలీసుల మధ్య సోమవారం తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. మొదటగా శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు.. పోలీసుల రాకతో రెచ్చిపోయి, పోలీసులపై రాళ్లు రువ్వరు. దాంతో పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

ఈ అల్లర్లపై నేపాల్ పోలీసులు మాట్లాడుతూ..”ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా డీజిల్‌పై 12 శాతం, పెట్రోల్ 16 శాతం ధరల్ని పెంచింది. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి విభాగమైన ఆల్ నేపాల్ నేషనల్ ఫ్రీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి బాధ్యత లేదని, ఈ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తగున్న డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై దినేష్ మినాలి అనే పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిరసనకారులు రాళ్లు విసిరారని, పోలీసు వాహనం ధ్వంసం చేశారని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని ఎవరినీ అరెస్ట్ చేయలేదు” అని పోలీసులు వెల్లడించారు.

శ్రీలంక దేశంలో తాజాగా ఆర్ధిక సంక్షోభంతో అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడిన విషయం తెలిసిందే. ఆర్ధిక, ఆహార సంక్షోభం కారణంగా గతకొన్ని నెలలుగా ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని అక్కడి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఆందోళనలు, నిరనలు చేపట్టారు. దాంతో ప్రధాని మహింద రాజపక్స తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికి ఆయనపై ప్రజలు తీవ్రంగా మండిపడుతూ, తీవ్రమైన దాడులు చేశారు. ఈ క్రమంలో నేపాల్ దేశంలో గతకొన్ని రోజులుగా శ్రీలంక పరిస్థితులే నెలకుంటున్నాయి. ప్రతిపక్షాలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.