Another step forward by Telangana Sarkar.. PTM every month
mictv telugu

తెలంగాణ సర్కార్ మరో ముందడుగు..ప్రతినెలా పీటీఎం

August 25, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైద్యశాఖ, విద్యాశాఖలను అభివృద్ది చేయటం కోసం ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా మూడోవ శనివారం తప్పనిసరిగా పేరెంట్స్ టీచర్ సమావేశాలను నిర్వహించాలని బుధవారం విద్యాశాఖ అధికారులు..అన్నీ ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంపై సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు..సమావేశం ఎట్లా నిర్వహించాలి? నిర్వహణకు ఉండాల్సిన నియమ, నిబంధనలు ఏంటి? అనే పూర్తి వివరాలతో కూడిన ఓ ఎజెండాను రూపొందించారు. ఇందులో భాగంగా ప్రతి నెలా పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) సమావేశాలతో పాటు వీటిని సైతం తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు.

పీటీఎం మార్గదర్శకాలు ఇవే..

1.ప్రతి నెలా తరగతుల వారీగా పేరెంట్ టీచర్ సమావేశాలను మూడో శనివారం నిర్వహించాలి.
2.ఒకవేళ మూడో శనివారం సెలవురోజు అయితే నాలుగో శనివారం నిర్వహించుకోవచ్చు.
3.తరగతుల వారీగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పరం చర్చించాలి.
4.ముఖ్యంగా విద్యార్డుల విద్యా పురోగతి, హాజరు, ప్రవర్తన, సమస్యలు, అలవాట్లు, ఆసక్తులను అంచనావేయాలి.
5.విద్యాప్రమాణాలు, పాఠశాలల్లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రుల సూచనలు స్వీకరించాలి.

ఇక, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్ల విషయానికొస్తే.. తరగతుల వారీగా పేరెంట్ టీచర్ సమావేశాల ప్రణాళికను రూపొందించాలి. సమావేశాలను సాధ్యమైనంత మేరకు ఉదయమే నిర్వహించాలి. తల్లిదండ్రులంతా పక్కగా హాజరయ్యేలా చూడాలి. ప్రధానోపాధ్యాయుడు లిఖితపూర్వక సమాచారం ద్వారా తల్లిదండ్రులను సమావేశాలకు ఆహ్వానించాలి”అని ఎజెండాలో పేర్కొన్నారు.