కశ్మీరులో మరో ఉగ్రదాడి.. మహిళ టీచర్‌ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీరులో మరో ఉగ్రదాడి.. మహిళ టీచర్‌ మృతి

May 31, 2022

జమ్మూ కశ్మీరులో మంగళవారం ఉదయం మరో ఉగ్రదాడి జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు రజ్ని బాలా(36)పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడున్న సహా ఉద్యోగులు ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ ఘటనతో కశ్మీర్ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు.

కశ్మీరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..’కుల్గాం జిల్లా గోపాల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయినిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలు సాంబా ప్రాంతానికి చెందిన రజ్ని బాలా (36). ఆమె కశ్మీరీ పండిట్‌ కావడంతో ఉగ్రవాదులు ఆమెపై దాడి చేశారు. ఉగ్రవాదుల్ని వీలైనంత త్వరగా ఏరివేస్తాం” అని వివరాలు వెల్లడించారు.

మరోపక్క మూడు వారాల కిందట కశ్మీరీ పండిట్‌ రాహుల్‌ భట్‌‌ను ప్రభుత్వ ఉద్యోగిని కార్యాలయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గతవారం టీవీ నటి అమ్రీన్‌ భట్‌ను కిరాతకంగా కాల్చి చంపారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు రజ్ని బాలాని ఉగ్రవాదులు కాల్చి చంపాడంతో కేంద్ర ప్రభుత్వంపై కశ్మీరీ పండిట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీరులో జరుగుతున్న వరుస ఉగ్రదాడులపై కశ్మీరీ పార్టీలన్నీ ఏకమై, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ ఘటనపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని కశ్మీర్లు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.