తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

May 4, 2022

తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో రాబోయే మూడు రోజుల (గురు, శుక్ర, శని)పాటు భారీ వర్షాలు కురుస్తాయని బుధవారం అధికారులు వెల్లడించారు.

ఇక, బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, యాదాద్రి, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లో గంటసేపు వర్షం దంచికొట్టడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది.

సీతాఫల్‌మండిలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్లు. బన్సీలాల్‌పేటలో 6.7, వెస్ట్‌ మారేడుపల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్‌లో 5.8, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావ్‌ నగర్‌లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, గుడిమల్కాపూర్‌, నాచారంలో 4.1, అంబర్‌పేటలో 4, అమీర్‌పేట, సంతోష్‌నగర్‌లో 3.7, ఖైరతాబాద్‌లో 3.6, బేగంబజార్‌, హయత్‌నగర్‌, చిలుకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.