Another tragedy in Ukraine.. 22 people died
mictv telugu

ఉక్రెయిన్‌లో మరో దారుణం​..22 మంది మృతి

August 25, 2022

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో వందలాది మంది రష్యా సైనికులు, ఉక్రెయిన్ దేశపు సైనికులు మృతి చెందారు. వీరితోపాటు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు వదిలారు.అయినా కూడా యుద్ధం మాత్రం విరామించుకోవటం లేదు రెండు దేశాలు.

ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లోని ఓ రైల్వేస్టేషన్‌పై రష్యా మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో ఏకంగా 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్విటర్ వేదికగా ప్రకటించారు.

జెలెన్ స్కీ మాట్లాడుతూ..”తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్‌కు పశ్చిమాన 145 కి.మీ (90 మైళ్లు) దూరంలో ఉన్న చాప్లిన్ అనే చిన్న పట్టణంలో రష్యా రాకెట్లు రైలును ఢీకొన్నాయి. నాలుగు క్యారేజీలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వినాశకరమైన సంఘర్షణ ఇది. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టిన ఆరునెలల వ్యవధిలో మా దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రష్యా చేసిన ఈ దాడి అసహ్యమైంది. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. రష్యా చేసిన ప్రతి దానికీ ఆ దేశం బాధ్యత వహించాల్సిందే” అని ఆయన అన్నారు.