Another tweet of Rajasingh after coming out of jail
mictv telugu

జైలు నుంచి రాగానే రాజాసింగ్ మరో ట్వీట్..

November 10, 2022

విద్వేష ప్రసంగాలు, సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించారన్న కేసులో జైలు నుంచి రాజాసింగ్ విడుదల అయ్యారు. దాదాపు రెండు నెలలు జైల్లో ఉన్న ఆయనకు తెలంగాణ హైకోర్టు బుధవారం షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మతాలను కించపరిచే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేయరాదని, ర్యాలీలలో పాల్గొనవద్దని, మూడు నెలల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోర్టు సూచించింది. బెయిల్ వచ్చిన కొద్ది నిమిషాలకే చర్లపల్లి జైలు నుంచి ఆయన బయటకొచ్చారు. అయితే జైలు నుంచి ఇంటికి రాగానే రాజాసింగ్ మరో ట్వీట్ చేసారు. ‘ధర్మం విజయం సాధించింది. మరోసారి మీకు సేవ చేయడానికి వచ్చాను. జై శ్రీరామ్’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షరతులు విధించిన కోర్టును కాదని రాజాసింగ్ ట్వీట్ చేయడంపై ఆసక్తి నెలకొంది.