వరుసగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు కం నిర్మాత విజయ్ బాబుపై మరో మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తాను పరిచయమైన అరగంటలోనే బలవంతంగా తన పెదాలపై విజయ్ బాబు ముద్దుపెట్టాడని ఫేస్బుక్ వేదికగా ఆరోపించింది. దీంతో విజయ్ బాబు హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే ఓ యువ నటి విజయ్ బాబు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మహిళ అలాంటి విషయమే చెప్పడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళీ మూవీ ఆర్టిస్ట్ (అమ్మ) విజయ్ బాబు సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో తన వల్ల అసోసియేషన్‌కు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతో తానే స్వయంగా సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరానని విజయ్ బాబు వెల్లడించారు. లైంగిక ఆరోపణలు అవాస్తవమని నిరూపించే వరకు సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు తెలిపారు.