హైదరాబాద్‌లో మరో దారుణం… నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో మరో దారుణం… నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య

September 26, 2018

హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు మీద రక్తం మళ్లీ చిందింది. ఎర్రగడ్డలో జరిగిన దారుణం గురించి మరువక ముందే మరో హత్య చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా నగరంలోని అత్తాపూర్‌లో ఓ వ్యక్తిని నలుగురు దుండగులు కలిసి అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. పిల్లర్ నంబర్ 143 దగ్గర రోడ్డుమీద, అంత ట్రాఫిక్ మధ్యలో, అందరూ చూస్తుండగానే కిరాతకంగా నరికి చంపారు.అంతమంది జానాల మధ్య ఈ కిరాతకానికి పాల్పడ్డారు హంతకులు.Another worst thing in Hyderabad.. is the man's murder on the roadside జరుగుతున్న దారుణాన్ని చూసి చుట్టుపక్కల జానాలు హడలెత్తిపోయారు. వారిని అడ్డుకోవడానికి సాహసించలేకపోయారు. ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం వాళ్ళను నిలువరించడానికి ప్రయత్నించాడు. ఓ వ్యక్తి కూడా నరుకుతున్న వ్యక్తిని వెనకనుంచి గట్టిగా తోశాడు. కిందపడ్డా కూడా లేచి మళ్ళీ నరకడం మొదలుపెట్టాడు. హత్య అనంతరం ట్రాఫిక్ పోలీస్ ఒకర్ని పట్టుకున్నాడు. మిగిలిన ముగ్గురు హంతకులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే హత్యకు గురి అయిన వ్యక్తి ఎవరు అన్నది తెలియాల్సి వుంది. వ్యక్తిగత కక్ష్యల వల్లే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానం వ్యక్తి చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.